Share News

కామన్వెల్త్ గేమ్స్ 2026: పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ

ABN , Publish Date - Aug 09 , 2026 | 09:08 PM

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు.

కామన్వెల్త్ గేమ్స్ 2026: పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ
PM Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వారు చూపిన పట్టుదల, కృషిని కొనియాడారు. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అన్ని క్రీడల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని.. యువత మరింత మంది క్రీడల వైపు వచ్చేలా వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు.


‘జో ఖేలేగా వో ఖిలేగా. భారత్‌కు ఎప్పుడూ మద్దతుగా నిలవండి. భారత్‌ మాతా కీ జై!’ అంటూ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. యువత క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ గతంలోనూ ఆయన ‘జో ఖేలేగా వో ఖిలేగా’ నినాదాన్ని పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.


ప్రధానితో సమావేశమైన బాక్సింగ్‌ స్వర్ణ పతక విజేత సాక్షి చౌదరి ఈ భేటీపై ఆనందం వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేతలందరినీ ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఆయనను కలవడం ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. ప్రధానమంత్రి చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయనతో మాట్లాడటం అద్భుతమైన అనుభవం’ అని సాక్షి తెలిపింది.


బాక్సింగ్‌లో చారిత్రక ప్రదర్శన

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత పతకాల వేటలో బాక్సింగ్‌ కీలక పాత్ర పోషించింది. భారత బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా.. అందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో భారత బాక్సింగ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా భారత మహిళా బాక్సర్లు అదరగొట్టారు. ఏడు స్వర్ణాల్లో ఐదు మహిళల ఖాతాలోనే చేరాయి.


ఇవి కూడా చదవండి:

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

Updated Date - Aug 09 , 2026 | 09:09 PM