Share News

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం

ABN , Publish Date - Aug 09 , 2026 | 06:07 PM

శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం
India Vs Sri Lanka XI

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్(61*) హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. గాయం బారిన పడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(44) నేడు బ్యాట్ పట్టాడు. స్టార్ బౌలర్ సిరాజ్(32*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరిలో హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో కేషారా 2 విశ్వా ఫెర్నాండో, రమేశ్ మెండీస్ తలొక వికెట్ పడగొట్టారు.


తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎలెవన్ 363/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడిన భారత బౌలర్లు.. రెండో రోజు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 357/6 వద్ద డిక్లేర్ ఇచ్చింది. దేవదత్ పడిక్కల్(142*) సూపర్ సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా(63*) రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎలెవన్ 200/6 వద్ద డిక్లేర్ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అద్భుతంగా ఛేదించింది.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!

ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్

Updated Date - Aug 09 , 2026 | 06:08 PM