Share News

ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్

ABN , Publish Date - Aug 09 , 2026 | 02:51 PM

టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయపడటంపై వస్తోన్న విమర్శలకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో సీఓఈపై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశాడు.

ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్
VVS Laxman

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయపడటంపై వస్తోన్న విమర్శలకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో సీఓఈపై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఓపెనర్ సాయి సుదర్శన్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సమయంలో శుభ్‌మన్ గిల్ చేతి బొటనవేలికి గాయమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం. దీంతో ఆటగాళ్లను పూర్తి ఫిట్‌నెస్ సాధించకముందే జట్టులోకి పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిన్నంటినీ లక్ష్మణ్ ఖండించాడు.


‘బ్లేమ్‌ అనే పదాన్ని ఉపయోగించడం మాకు ఇష్టం లేదు. ఎవరినైనా బలిపశువుగా చూపించడం సరికాదు. సీఓఈ, జట్టు మేనేజ్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ సిబ్బంది, సెలక్షన్‌ కమిటీ మధ్య సమన్వయం అద్భుతంగా ఉంది. ఆటగాడి ఫిట్‌నెస్‌ స్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు సెలక్షన్‌ కమిటీకి అందుతాయి. పునరావాస ప్రక్రియలో ఆటగాడి పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోతే సెలక్షన్‌ కమిటీ, కోచ్‌లకు వెంటనే సమాచారం అందిస్తాం. బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎంపిక చేశారు. వారు ఫిట్‌నెస్‌ పరీక్షలో అర్హత సాధించకపోతే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలో సెలెక్టర్లకు ముందే తెలుస్తుంది. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఆటగాడు-జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగుతుంది’ అని లక్ష్మణ్‌ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచకప్‌2027లో రోహిత్ ఆడాల్సిందే.. అజింక్య రహానే కీలక సూచన!

తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత

Updated Date - Aug 09 , 2026 | 02:52 PM