Share News

శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు శుభవార్త

ABN , Publish Date - Aug 09 , 2026 | 02:03 PM

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు భారత్ జట్టుకు గుడ్ న్యూస్‌. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? ఆందోళ‌న అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే..

శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు శుభవార్త
Shubman Gill

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక, భారత్ మధ్య రెండు మ్యాచుల టెస్టుల సిరీస్ మరో ఆరు రోజుల్లో ప్రారంభ కానుంది. ఇప్పటికే గాయాల బెడదతో టీమిండియా ఆందోళనలో ఉంది. ఈ క్రమంలోనే సిరీస్ ఆరంభానికి ముందు భారత్ క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్‌ అందింది. ప్రాక్టీస్ సెషన్‌లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆడటంపై సందేహాలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని ఫొటోలు అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది.


ప్రస్తుతం గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అత‌డు తిరిగి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఈ క్రమంలోనే కొలంబో వేదిక‌గా శ్రీలంక ఎలెవ‌న్‌తో జ‌రుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చేతి వేలి గాయం కార‌ణంగానే తొలి రెండు రోజుల ఆట‌కు గిల్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.


మూడో రోజు ఫీల్డింగ్ రానప్పటికీ బ్యాటింగ్ మాత్రం చేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. గిల్ గైర్హాజరీలో భార‌త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యహ‌రిస్తున్నాడు. ఇప్పటికే శ్రీలంక‌తో సిరీస్‌కు ఇన్‌ఫామ్ ప్లేయ‌ర్లుగా ఉన్న జ‌స్ప్రీత్ బుమ్రా, సాయిసుద‌ర్శన్‌లు గాయం కార‌ణంగా దూర‌మ‌య్యారు. ఆల్‌రౌండ‌ర్ వాషింగ్టన్ సుంద‌ర్ కూడా మొదటి టెస్ట్‌లో ఆడకపోవచ్చని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచకప్‌2027లో రోహిత్ ఆడాల్సిందే.. అజింక్య రహానే కీలక సూచన!

తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత

Updated Date - Aug 09 , 2026 | 02:16 PM