శ్రీలంకతో టెస్టు సిరీస్: సాయి సుదర్శన్‌కు గాయం.. రిప్లేస్‌మెంట్‌గా సర్ఫరాజ్ ఖాన్?
ABN , Publish Date - Aug 09 , 2026 | 04:43 PM
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ సమయానికి అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు లేనట్లు సమాచారం. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సాయి సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధనలోనూ పాల్గొంటున్నప్పటికీ.. ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టు నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమేనని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకకు భారత జట్టు బయలుదేరిన సమయంలో సాయి సుదర్శన్ ప్రయాణించలేదు. దీంతో కొలంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు కూడా అతడు దూరమయ్యాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గురువారం ప్రాక్టీస్ సమయంలో కుడి చేతి ఉంగరపు వేలికి గాయం కావడంతో వార్మప్ మ్యాచ్ తొలి రోజు అతడు ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా మూడో రోజు వార్మప్ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగాడు.
ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఎడమ మోకాలికి అయిన గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకున్నారు. గాయాల జాబితాలో హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ కూడా ఉన్నారు. హర్షిత్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో, నితీశ్ తొడ కండరాల సమస్యతో బాధపడుతున్నారు. హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కారణంగా తొలి టెస్టుకు వాషింగ్టన్ సుందర్ దూరం కాగా.. వెన్నులో స్ట్రెస్ రియాక్షన్ నుంచి కోలుకుంటున్న ఆకాశ్ దీప్ కూడా అందుబాటులో లేడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!
ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్