Share News

మోదీని నవ్వించిన బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:06 PM

కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది.

మోదీని నవ్వించిన బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
Narendra Berwal

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది. 2015 మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌లో పాకిస్థాన్‌ బాక్సర్‌తో జరిగిన పోరును గుర్తుచేసుకున్న బేర్వాల్‌.. ఆ మ్యాచ్‌ తర్వాత అతడు చెప్పిన మాటలను మోదీకి వివరించాడు.


‘2015 మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌లో నా తొలి రౌండ్‌ పోరు పాకిస్థాన్‌ బాక్సర్‌తో జరిగింది. పాకిస్థాన్‌ ఆటగాడితో ఓడిపోవద్దని అప్పుడు ఉన్నతాధికారులు, సహచరులు చెప్పేవారు. ఆ మ్యాచ్‌లో నేను గెలిచాను. అయితే పోరులో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లాం. మీరు 2014లో ప్రధానిగా వచ్చారు. మా ఆర్మీ కోచ్ పేరు కూడా నరేంద్ర రాణా. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. పాక్ బాక్సర్ ఓ విషయాన్ని గమనించాడు. ‘బ్రదర్ నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నా’ అన్నాడు. సరే చెప్పు అని బదులిచ్చా. ‘నీ పేరు నరేంద్ర. మీ కోచ్ పేరు నరేంద్ర. మీ ప్రధాని నరేంద్ర. నాకు ఈ పేరు అంటేనే అసహ్యం వచ్చేసింది’ అన్నాడు’ అని బాక్సర్ బేర్వాల్ చెప్పాడు. దీనికి మోదీ గట్టిగా నవ్వేశారు.


ఇవి కూడా చదవండి:

జట్టు నుంచి పిలుపు రాకపోయినా ప్రయత్నాలు ఆపొద్దు.. షమీకి జహీర్ ఖాన్ సూచన

బుమ్రా కాదు.. ఆ స్టార్ ప్లేయర్ గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 10 , 2026 | 01:06 PM