Share News

మూడు రోజులైనా దొరకని వృద్ధుడి డెడ్‌బాడీ.. కొనసాగుతున్న గాలింపు

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:21 AM

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌ వైశాలీనగర్ మ్యాన్‌‌హోల్‌లో పడి బాలయ్య అనే వృద్ధుడు మృతిచెందిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా బాలయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మూడు రోజులైనా దొరకని వృద్ధుడి డెడ్‌బాడీ.. కొనసాగుతున్న గాలింపు
Hyderabad manhole tragedy

హైదరాబాద్, ఆగస్టు 1: నగరంలోని హఫీజ్‌పేట్‌ వైశాలీనగర్ మ్యాన్‌‌హోల్‌లో పడి బాలయ్య అనే వృద్ధుడు మృతిచెందిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా బాలయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వృద్ధుడి కోసం 450 మంది జీహెచ్‌ఎంసీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మియాపూర్, శేర్లింగంపల్లి, పటాన్‌చెరు డీసీలు.. స్వయంగా రంగంలోకి దిగి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరు ముత్తంగి వరకు రోబోటిక్ టెక్నాలజీతో బాలయ్య మృతదేహం కోసం అన్వేషణ కొనసాగుతోంది.


మరోవైపు, అసలు బాలయ్య నాలాలో పడ్డాడా లేదా అనే కోణంలోను పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక, బాలయ్య గాలింపు పుణ్యమా అని ఐదేళ్లుగా పేరుకుపోయిన నాలాలన్నీ శుభ్రమవుతున్నాయి. బాలయ్య మృతదేహం కోసం వెతుకుతూ.. నాలాలన్నింటినీ అధికారులు క్లీన్ చేయించారు.


ఇవి కూడా చదవండి...

ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలో పులి మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన...

55.90 అడుగులకు గోదావరి నీటిమట్టం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 12:07 PM