Share News

55.90 అడుగులకు గోదావరి నీటిమట్టం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:35 AM

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం 55.90 అడుగులకు చేరింది. దాదాపు 15,84,657 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

55.90 అడుగులకు గోదావరి నీటిమట్టం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
Godavari floods

భద్రాద్రికొత్తగూడెం, ఆగస్టు 1: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం 55.90 అడుగులకు చేరింది. దాదాపు 15,84,657 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు భద్రాచలం గోదావరి వరదలపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రాచలంలోకి వరద నీరు రాకుండా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరదలపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రి సమీక్షిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..

ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలో పులి మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 10:40 AM