అంత్యక్రియల్లో అవకతవకలు.. నిర్వాహకుడికి 20 ఏళ్ల జైలు..
ABN , Publish Date - Aug 01 , 2026 | 09:01 AM
బ్రిటన్‌లో అంత్యక్రియల పేరుతో వందలాది కుటుంబాలను మోసం చేసిన నిర్వాహకుడు రాబర్ట్ బుష్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో అంత్యక్రియల పేరుతో వందలాది కుటుంబాలను మోసం చేసిన నిర్వాహకుడు రాబర్ట్ బుష్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మృతదేహాలను సక్రమంగా ఖననం చేయకపోవడం, కొంతమందికి అస్థికలు మార్చి ఇవ్వడం వంటి దారుణాలకు రాబర్ట్ బుష్ పాల్పడినట్లు కోర్టు తేల్చింది (UK funeral director Cheating).
ఇంగ్లండ్‌లోని హల్ నగరంలో లెగసీ ఇండిపెండెంట్ ఫ్యూనరల్ డైరెక్టర్స్ పేరుతో వ్యాపారం నిర్వహించిన 48 ఏళ్ల రాబర్ట్ బుష్ దాదాపు 12 సంవత్సరాల పాటు మోసాలకు పాల్పడ్డాడు. చట్టబద్ధమైన ఖననం చేయకపోవడం, తప్పుడు హామీలతో కుటుంబాలను మోసం చేయడం, దాతృత్వ సంస్థలకు ఇవ్వాల్సిన విరాళాలను దుర్వినియోగం చేయడం వంటి మొత్తం 60కి పైగా నేరాలను అతడు అంగీకరించాడు (Hull funeral scandal).
2024లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బుష్ సెలవులో ఉండగా అక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ 35 మృతదేహాలను నిర్లక్ష్యంగా వదిలేసినట్టు గుర్తించారు. వాటిలో కొన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఒక శిశువు మృతదేహాన్ని కాగితపు సంచిలో ఉంచారు. ఆ శిశువు తల్లిదండ్రులకు వేరొకరి అస్థికలను ఇచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది (wrong ashes funeral fraud).
పోలీసులు రాబర్ట్ బుష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రాబర్ట్ బుష్ చర్యలను కోర్టు ఘోరమైన నమ్మక ద్రోహాలుగా అభివర్ణించింది. బాధిత కుటుంబాలకు జరిగిన మానసిక వేదనను మాటల్లో చెప్పలేమని వ్యాఖ్యానించింది. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇవి కూడా చదవండి..
చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..