Share News

పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్‌

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:05 PM

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ ఆర్మీ దాడులపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పౌరులపై పాకిస్థాన్‌ అరాచకాలను భారత్ ఖండించింది.

పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్‌
POK attacks

ఇంటర్‌నెట్ డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ ఆర్మీ దాడులపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పౌరులపై పాకిస్థాన్‌ అరాచకాలను భారత్ ఖండించింది. పీఓకేలో దాడులను అంతర్జాతీయ సమాజం పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్‌ను జవాబుదారీగా చేయాలని భారత్ పిలుపునిచ్చింది.


పీఓకేలో మారణకాండ..

స్థానిక మానవ హక్కుల సంఘాలు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల మేరకు.. జులై 27, 28 తేదీల్లో రావల్‌కోట్, మీర్‌పూర్, కోట్లి, ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తుండగా పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 40 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.


400 మందికి పైగా గాయపడ్డారు. పాక్ ఆర్మీ వందలాది మందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లకు తరలించింది. పాక్ సైన్యం తమ అరాచకాలను దాచడానికి స్థానిక ఆసుపత్రులు, వీధుల నుంచి అమాయక పౌరుల మృతదేహాలను బలవంతంగా ఎత్తుకెళ్లి మాయం చేస్తోందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

హెల్త్ కేర్ ట్రస్ట్ నిధుల సద్వినియోగంపై సీఎస్ ఆదేశాలు

ఆగస్టు చివరలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు శ్రీకారం: మంత్రి పొంగులేటి

Updated Date - Jul 31 , 2026 | 07:03 PM