Share News

చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:24 AM

అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ మరో నాలుగు రోజుల్లో చంద్రుడిని ఢీ కొట్టనుంది. 2025 జనవరిలో రెండు ల్యాండర్లను అంతరిక్షంలోకి ఈ రాకెట్ తీసుకెళ్లింది.

చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..
Moon collision

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ మరో నాలుగు రోజుల్లో చంద్రుడిని ఢీ కొట్టనుంది. 2025 జనవరిలో రెండు ల్యాండర్లను అంతరిక్షంలోకి ఈ రాకెట్ తీసుకెళ్లింది. అనంతరం ఈ రాకెట్ ఇంధనం పూర్తిగా ఖాళీ కావడంతో అంతరిక్షంలోనే తేలియాడుతూ ఉండిపోయింది. ప్రస్తుతం చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావంతో అది అటు వైపు దూసుకెళ్తోంది (SpaceX Falcon 9 Moon collision).


ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ రాకెట్ ఆగస్టు 5న గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టనుంది. ఆ రాకెట్ పొడవు 12 మీటర్లు. బరువు సుమారు 4,500 కిలోలు. చంద్రుడి పశ్చిమ అంచున ఉన్న ఐన్‌స్టీన్ బిలం సమీపంలో ఈ రాకెట్ ఢీకొట్టే అవకాశం ఉంది (SpaceX rocket crash).


ఆ రాకెట్ ఢీ కొట్టడం వల్ల చంద్రుడిపై సుమారు 27 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల లోతు గల కొత్త బిలం ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఢీకొట్టిన సమయంలో చంద్రుడిపై భారీగా ధూళి, శకలాలు పైకి ఎగిరే అవకాశం ఉంది. ఈ ఘటనను భూమిపై ఉన్న శక్తివంతమైన టెలిస్కోపులతో పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు (Moon impact August 2026).


ఈ ఘటన వల్ల భూమికి ఎలాంటి ప్రమాదమూ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు (Lunar mission). ఇది పూర్తిగా చంద్రుడిపైనే జరిగే సంఘటన. ఇలా ఢీకొట్టడం వల్ల చంద్రుడి ఉపరితల నిర్మాణం గురించి కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నాసాతో పాటు ఇతర అంతరిక్ష సంస్థలు కూడా ఈ ఘటనను నిశితంగా గమనించనున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్‌

కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్‌ బలోచ్‌ సోదరుడిపై కాల్పులు

Updated Date - Aug 01 , 2026 | 07:24 AM