Share News

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం..!

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:03 PM

ప్రియుడి కోసం ఓ మహిళ దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి అనంతపురం జిల్లాలోని గరుడచేడుకు వచ్చిన ఘటన వెలుగు చూసింది.

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం..!
Instagram love story

  • రైల్వేకోడూరు నుంచి వచ్చిన మహిళ

  • పోలీసుల సాయంతో తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

కణేకల్లు(అనంతపురం): ప్రియుడి కోసం ఓ మహిళ దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి మండలంలోని గరుడచేడుకు వచ్చిన ఘటన వెలుగు చూసింది. గరుడచేడు గ్రామానికి చెందిన 23 ఏళ్ల వంశీకి వైఎస్ఆర్‌ కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన 26 ఏళ్ల శ్రావణితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈమెకు 2024 లోనే వివాహం జరగ్గా, భర్తతో మనస్పర్థల నేపథ్యంలో పుట్టింటిలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వంశీ పరిచయం కావడం, ఫోన్‌ సంభాషణలతో వారి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. పెళ్లి చేసుకుని, జీవించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.


ఈ నెల 12న శ్రావణి రైల్వేకోడూరు నుంచి వంశీ స్వగ్రామమైన గరుడచేడుకు చేరుకుంది. అప్పటి నుంచి వంశీతోనే ఉంటోంది. కాగా శ్రావణి కుటుంబసభ్యులు తమ అమ్మాయి కనపడటం లేదంటూ రైల్వేకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో శ్రావణి గరుడచేడులో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసుల సాయంతో శ్రావణి సోదరుడు జితేంద్ర, పెద్దనాన్న పెంచలయ్య బుధవారం గరుడచేడుకు చేరుకుని, శ్రావణిని తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు.


pandu2.2.jpgకానీ తాను రానని, వంశీని ప్రేమించానని, అతడితోనే జీవితం గడుపుతానని చెప్పింది. కానీ రైల్వేకోడూరులో మిస్సింగ్‌ కేసు ఉన్నందున నువ్వు అక్కడికి వచ్చి తహసీల్దార్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు ఉండని పోలీసులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యుల వెంట స్వగ్రామానికి వెళ్లిపోయింది. కాగా వ్యవసాయ పనులు చేసుకునే వంశీకి శ్రావణితో పెళ్లికి ఆయన కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:06 PM