Share News

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

ABN , Publish Date - Jul 23 , 2026 | 09:31 AM

ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
Dola Bala Veeranjaneya Swamy

అమరావతి, జులై 23: ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఈరోజు(గురువారం) పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించామని తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించామని.. చాలా గొప్పగా ఉన్నాయని కొనియాడారు.


మినిస్టర్ క్వార్టర్స్, సెక్రటరీ భవనాలను పరిశీలించామని మంత్రి తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ అద్భుతమైన నివాసయోగ్యమైన నగరం నిర్మితమవుతోందన్నారు. త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడకు వస్తుందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్వాంటం వ్యాలీని అమరావతిలోనే అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని భవన నిర్మాణాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. ఐకానిక్ భవనాల మొదటి డైమండ్‌లు కూడా పూర్తవుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్‌లు సిద్ధమవుతాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

బ్రిడ్జ్‌లు కూలుస్తాం.. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కౌంటర్!

సీజేపీ ఉద్యమంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పోస్టు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 10:41 AM