Share News

ఉద్యోగం రావడం లేదని.. యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:31 PM

ఉద్యోగం రావడం లేదని జీవితంపై విరక్తితో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

ఉద్యోగం రావడం లేదని.. యువతి ఆత్మహత్య

  • తెల్దారుపల్లిలో ఘటన

ఖమ్మం: ఉద్యోగం రావడం లేదని జీవితంపై విరక్తితో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్దారుపల్లి గ్రామానికి చెందిన ఉన్నం భవాని(26) పీజీ పూర్తి చేసి గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తు ఇంటివద్దనే ఉంటుంది. ఇంత చదువు చదువుకున్నా ఎలాంటి ఉద్యోగం రావడం లేదని కొంతకాలంగా దిగాలుగా ఉంటుంది. ఈ నెల17న ఉదయం బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఎంత సేపటికి రాలేదు.


job.jfifకుటుంబ సభ్యులు వెళ్లి డోర్‌తీసి చూడగా భవాని చేతిలో గడ్డిమందు డబ్బా ఉండడంతో, ఏమిటని ప్రశ్నించగా పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు బుధవారం మృతి చెందింది. తమ కూతురు పీజీ చేసినా ఎలాంటి ఉద్యోగం రాలేదని జీవితంపై విరక్తి చెందిన పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుందని భవాని తల్లి ఉన్నం రమణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎవరితోనూ పొత్తు ఉండదు: విజయ్‌

16 మంది ఐపీఎస్‌లకు అవార్డులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2026 | 12:32 PM