ప్రపంచంలోనే అతిపెద్ద ఖతార్ LNG ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:34 AM
ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగానే ఖతార్, యూఏఈ, సౌదీలలోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగానే ఖతార్, యూఏఈ, సౌదీలలోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన ఖతార్, తమ దేశంలోని ఇరాన్ ఎంబసీకి చెందిన మిలిటరీ, సెక్యూరిటీ అధికారులను 'పర్సనా నాన్ గ్రాటా' (Persona Non Grata)గా ప్రకటించి, 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఖతార్‌లోని ఇంధన వనరులపై మళ్లీ దాడులు జరిగితే ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాలో 20% వాటా కలిగిన రాస్ లఫ్ఫాన్ దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే యూరప్, ఆసియా దేశాలు ఇంధన కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
రజినీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..
భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!