కుదిరితే ఉద్యోగుల స్థానంలో ఏఐ.. కంపెనీల అభిప్రాయం ఇదే
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:06 PM
అవకాశం ఉంటే ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించుకునేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. రెజ్యూమెబిల్డర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించేందుకు రెడీగానే ఉన్నాయట. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా మెజారిటీ సంస్థల అభిప్రాయం ఇదేనని ఓ సర్వేలో తేలింది. కంపెనీల్లో ఏఐ పాత్రకు సంబంధించి రెజ్యూమెబిల్డర్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
అమెరికాలో 500 మంది వ్యాపారవేత్తలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. ఏఐ సామర్థ్యాలు మరింత పెరిగే కొద్దీ లేఆఫ్స్ తప్పవన్న భావన కంపెనీల్లో వేళ్లూనుకున్నట్టు సర్వే తేల్చింది. ఉద్యోగులకు బదులు ఏఐపై అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అనేక మంది వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రతి 10 కంపెనీల్లో తొమ్మిది సంస్థలు చెప్పాయట. ఏఐపై పెట్టుబడులకు నిధుల కోసం ఉద్యోగుల లేఆఫ్స్‌ను తట్టుకునేందుకూ సిద్ధమని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. ఏఐపై పెట్టుబడులు తమ భవిష్యత్తుకు కీలకమని కంపెనీలు విశ్వసిస్తున్నాయని రెజ్యూమెబిల్డర్ చీఫ్ కెరీర్ అడ్వైజర్ స్టేసీ హేలర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల నుంచి ప్రతిఘటన కూడా తక్కువగానే ఉండొచ్చని సంస్థలు అంచనా వేస్తున్నాయట.
ఇక పలు కార్పొరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపడుతున్న విషయం తెలిసిందే. పునర్ వ్యవస్థీకరణ పెరిట కొన్ని, నిధుల సమీకరణ కోసం మరికొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ ఇంటెలిజెంట్ టూల్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో లేఆఫ్స్ తప్పడం లేదని ఇటీవల ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ సీఈఓ జాక్ డోర్సీ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలూ చదవండి:
ఉగాది రోజున గుడ్ న్యూస్.. పసిడి ధరలో భారీ కోత
దేశంలో తయారీ రంగానికి ప్రోత్సాహం.. రూ.33,660 కోట్లతో భవ్య