Share News

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

ABN , Publish Date - Jun 03 , 2026 | 10:23 AM

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌
Cyber Call Centers

  • కొల్లగొట్టిన డబ్బు నిమిషాల్లో దారిమళ్లిస్తున్న సైబర్‌ క్రిమినల్స్‌

  • ‘ఆపరేషన్‌ ఆక్టోప్‌స’లో విస్తుపోయే విషయాలు

  • తెరవెనుక ఉన్న ముఠాలపై పోలీసుల దృష్టి

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 1.0, 2.0లో భాగంగా సైబర్‌ కేటుగాళ్లు కొల్లగొట్టిన డబ్బును నిమిషాల వ్యవధిలోనే ఎలా దారి మళ్లిస్తున్నారు.. ఇందుకు ఎవరు సహకరిస్తున్నారన్న దానిపై లోతుగా విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.


తెర వెనుక అతిపెద్ద నెట్‌వర్క్‌

సైబర్‌ క్రిమినల్స్‌ కొల్లగొట్టిన డబ్బు నిమిషాల్లోనే ఇతరుల ఖాతాలకు మళ్లించడం వెనక అతిపెద్ద నెట్‌వర్క్‌ విస్తరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్‌ నేరాల్లో కొల్లగొడుతున్న డబ్బును పదుల సంఖ్యలో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి ఎలా దారి మళ్లిస్తున్నారు..? బదిలీ అయిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చే ఏజెంట్లకు ఎలా పంపుతున్నారు..? ఆ తర్వాత డబ్బు మొత్తం విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుల ఖాతాల్లోకి నిమిషాల వ్యవధిలో ఎలా చేరుతుందనే అంశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విదేశాల్లో ఉన్న ప్రధాన క్రిమినల్స్‌కు.. కమీషన్‌పై బ్యాంకు ఖాతాలు సమకూర్చిన నిందితులకు మధ్యలో కొన్ని ప్రత్యేక సైబర్‌ ముఠాలు తెర వెనుక పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొట్టేసిన డబ్బుల బదిలీ వ్యవహారమంతా ఈ ముఠాలే చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.


వివిధ నగరాల్లో కాల్‌సెంటర్స్‌..?

ఆన్‌లైన్‌లో కొల్లగొట్టిన డబ్బును సైబర్‌ క్రిమినల్స్‌.. క్షణాల్లోనే సుమారు 20-30 ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అందుకోసం వివిధ నగరాల్లో, మారుమూల ప్రాంతాల్లో కాల్‌ సెంటర్స్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్‌ సెంటర్స్‌లో పనిచేస్తున్న టెలీకాలర్స్‌ ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పగిస్తున్నట్లు సమాచారం. ఖాతాల్లో డబ్బులు పడగానే.. వారికున్న ముందస్తు ఆదేశాల మేరకు.. కొంతమంది క్రిప్టో ఏజెంట్లకు, మరికొందరు బెట్టింగ్‌ మాఫియాకు చెందిన ఖాతాల్లోకి డబ్బును మళ్లిస్తున్నారు. మరికొందరు ఇతర ఖాతాలకు బదిలీ చేయడంతో పాటు.. విదేశాలకు డబ్బు తరలించేంత వరకు ఎవరి పని వారు చేస్తున్నట్లు తెలుస్తోంది.


city5.2.jpgఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు జరిగిన ఐపీ అడ్ర్‌సలు, ఇతర సాంకేతిక ఆధారాలతో తెరవెనుక ఉన్న ముఠాలను పట్టుకోవడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ ఆడుతున్న వారి ఖాతాల్లో జమ అవుతున్న డబ్బులు సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బులే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ మ్యూల్‌ ఖాతాలను (కేవైసీ లేని నకిలీ ఖాతాలు) ఆపరేట్‌ చేస్తున్న వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు సమాచారం. తదుపది నిర్వహించబోయే ఆపరేషన్‌ ఆక్టోప్‌సలో తెరవెనుక ముఠాలు దొరికితే.. పెద్ద ఎత్తున క్రిమినల్స్‌ పట్టుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీకి అన్నామలై రాజీనామా!

290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 10:23 AM