శుభవార్త.. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్లు
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:10 PM
80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినూత్నంగా కొన్ని ఆఫర్లు తీసుకువచ్చింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ CGM ఎం. శేషాచలం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్రీడం 2.0 ఆఫర్ కింద ఒక్క రూపాయికే సిమ్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
విజయవాడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ (BSNL) వినూత్నంగా కొన్ని ఆఫర్లు తీసుకువచ్చింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ CGM ఎం. శేషాచలం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్రీడం 2.0 ఆఫర్ కింద ఒక్క రూపాయికే సిమ్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మధ్య ఓటీటీలను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారని తెలిపారు. నెలకు రూ.1,111 ఫైబర్ సూపర్ ప్లస్ అందిస్తున్నామని అన్నారు. ఓటీటీ ప్లాన్ 200 Mbps హై-స్పీడ్‌తో ఇంటర్నెట్ ఇస్తున్నామని.. ఈ ప్లాన్‌లో నెలకు 5000GB నెట్ వర్తిస్తుందని వివరించారు. 25 నుంచి 27 OTT ప్లాట్‌ఫారమ్‌లు అందిస్తామని తెలిపారు. అపరిమిత 24x7 వాయిస్ కాల్స్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ONT రౌటర్‌ను కూడా అందిస్తామని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్‌ను కూడా రీ లాంచ్ చేశామని ప్రకటించారు.
4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి..
లక్ష రూపాయల్లో ఐ ఫోన్ తీసుకుంటే.... అది సిమ్ లేకుండా పనిచేయదని బీఎస్ఎన్ఎల్ CGM అన్నారు. అదే ఖర్చుతో శాటిలైట్ ఫోన్ తీసుకుంటే సిమ్‌తో వస్తుందని... దేశంలో ఎక్కడైనా ఇది పనిచేస్తుందని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్‌కు లక్ష సిగ్నల్ టవర్లు ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్ఎన్ఎల్‌కు 6850 టవర్లు ఉన్నాయని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఇకపై టెలికాం సేవలతో పాటు హార్డ్‌వేర్ సేవలను సైతం అందిస్తుందని చెప్పుకొచ్చారు.
గత ఏడాది రూ.24 వేల కోట్ల ఆదాయం..
మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా ఈ సిమ్ సేవలు అందిస్తోందని బీఎస్ఎన్ఎల్ CGM అన్నారు. జాతీయ స్థాయిలో గత ఏడాది బీఎస్ఎన్ఎల్ రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని గడించిందని చెప్పారు. ఏపీలో గత ఏడాది రూ.1100 కోట్ల ఆదాయం సాధించిందని.. ఈ ఏడాది రూ.1400 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 5జికి ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయని చెప్పారు. మరో 5 నుంచి 6 నెలల్లో సేవలు అందుబాటులోకి వస్తున్నాయని బీఎస్ఎన్ఎల్ CGM ఎం. శేషాచలం పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్
సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News