Share News

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:53 AM

రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు.

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు
Rajahmundry Godavari incident

రాజమహేంద్రవరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు మనవడికి ఈత రావడంతో సురక్షితంగా బయటపడగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, సహాయక బృందాలు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టాయి.


ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసిస్టెంట్ ఇంజినీర్ నూకరాజు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ కుటుంబం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ సభ్యుల నేపథ్యం, ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


వార్తలు కూడా చదవండి...

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 12:35 PM