Share News

సిద్ధాంతంలో వీరాభిమానిని కలిసిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 08 , 2026 | 08:54 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఒకసారి కలవాలని సోషల్ మీడియా ద్వారా సిద్ధాంతానికి చెందిన వీరాభిమాని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సత్యనారాయణ కోరిక మేరకు సీఎం.. ఆయనను ఆప్యాయంగా కలుసుకున్నారు.

సిద్ధాంతంలో వీరాభిమానిని కలిసిన సీఎం చంద్రబాబు
AP CM Chandra babu Naidu

పశ్చిమగోదావరి జిల్లా, జూన్8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని (CM Nara Chandrababu Naidu) ఒకసారి కలవాలని సోషల్ మీడియా ద్వారా పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతానికి చెందిన వీరాభిమాని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సత్యనారాయణ కోరిక మేరకు సీఎం.. ఆయనను ఆప్యాయంగా కలుసుకున్నారు. సత్యనారాయణ కోరికను తెలుసుకున్న సీఎం, ఆయనను తన బస్సులోకి ప్రత్యేకంగా ఆహ్వానించి దాదాపు 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ‘మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది’ అని సీఎం భరోసా కల్పించారు.


సీఎం చంద్రబాబును ప్రత్యక్షంగా చూసిన వెంటనే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారు తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా బాగానే ఉందని సీఎం‌కు వివరించారు. సత్యనారాయణతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఆయన ఆత్మవిశ్వాసాన్ని అభినందించారు. ‘అందరికంటే మీరే శక్తిమంతులు’ అని కొనియాడారు. సీఎం మాటలకు సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు.


ఈ సమావేశం ముగిసిన తర్వాత కూడా సత్యనారాయణ మరోసారి చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. జీవితంలో ఎప్పుడైనా సీఎం‌ను ఇలా దగ్గరగా కలుస్తానని తాను కలలో కూడా అనుకోలేదని సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఆత్మీయ కలయిక అక్కడ ఉన్న వారిని ఆకట్టుకోగా, అభిమానులపై సీఎం చంద్రబాబు చూపిన ఆప్యాయతపై పలువురు ప్రశంసలు కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు

16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల

Read AP News Latest And Telangana News  And National News

And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 09:39 PM