విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:29 AM
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో-లారీ ఢీ కొనడంతో ముగ్గురు మృతిచెందారు.
విజయనగరం జిల్లా, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో-లారీ ఢీ కొనడంతో ముగ్గురు మృతిచెందారు. దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు బాడంగి మండలం గజరాయనివలస వాసులుగా గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు
క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News