Share News

విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:06 AM

విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి
Vizianagaram Road Accident

విజయనగరం జిల్లా, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే..?

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు, పూసపాటిరేగ మండలం పేరాపురం జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. ఆ సమయంలో పేరాపురం దగ్గర రోడ్డు దాటుతున్న ఇరువురిని ఢీకొట్టింది. అనంతరం లారీని ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్ సహా మరొకరు మృతిచెందారు.


పోలీసుల చర్యలు..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.


కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదంలో ఒకరి మృతి

మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ బస్సు యానం నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఇందులో 15 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఉయ్యూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు కాపాడారు. అతివేగమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఉయ్యూరు జియో పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురం జిల్లాలోనూ..

మార్కాపురం జిల్లాలోని కంభం మండలం జంగంగుంట్ల వద్ద బైకును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 28 , 2026 | 07:40 AM