Share News

జగన్ క్రెడిట్ చోరీగా మిగిలిపోతారు.. మంత్రి కొండపల్లి సెటైర్లు

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:18 AM

ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

జగన్ క్రెడిట్ చోరీగా మిగిలిపోతారు.. మంత్రి కొండపల్లి సెటైర్లు
AP Minister Kondapalli Srinivas

విజయనగరం, జులై 19 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (AP Minister Kondapalli Srinivas) వ్యాఖ్యానించారు. ఎర్ర బస్సు కూడా లేని భోగాపురానికి ఎయిర్ బస్సు ఎందుకని జగన్ రెడ్డి ప్రశ్నించారని ధ్వజమెత్తారు. ఆయన క్రెడిట్ చోరీగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయనగరం జిల్లా పర్యటన ఖరారు నేపథ్యంలో ఆయా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంగణాన్ని మంత్రి కొండపల్లి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు, ఎమ్మెల్యే నాగమాధవి, జిల్లా కలెక్టర్ రాంసుందరరెడ్డి, జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడారు.


భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ఖ్యాతి మోదీ, చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడుకి దక్కుతుందని తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మూలకారకులైన మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు

సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 02:06 PM