Share News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. నవ వధూవరుల కారుకు ప్రమాదం..

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:07 PM

అనకాపల్లి జిల్లాలో ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, వధూవరులు తీవ్రంగా గాయపడ్డారు..

అనకాపల్లి జిల్లాలో విషాదం.. నవ వధూవరుల కారుకు ప్రమాదం..
Anakapalli Car Accident

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో ఇవాళ(శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం (Anakapalli Car Accident) జరిగింది. నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, వధూవరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఒక్కసారిగా అదుపుతప్పి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట గ్రామానికి చెందిన నవ వధూవరులు నిన్న(శుక్రవారం) రాత్రి ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకలు ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా.. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం బత్తివానిపాలెం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారందరూ తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా పెళ్లికొడుకు చెల్లెలు లావణ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదం నింపింది. నిన్నటి వరకు పెళ్లి సంబరాల్లో మునిగిపోయిన కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.


ఆస్పత్రిలో చికిత్స..

ప్రమాదంలో గాయపడిన నవ వధూవరులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి సబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


పోలీసుల దర్యాప్తు...

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా....? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 04:50 PM