అరకులోయలో అగ్నిప్రమాదం.. గిరిజన రైతు కాఫీ తోట దగ్ధం
ABN , Publish Date - Mar 07 , 2026 | 10:20 AM
అల్లూరి జిల్లాలోని బస్కి పంచాయతీ కంజరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గిరిజన రైతుకు సంబంధించిన కాఫీ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో జి. అప్పలనాయుడుకి చెందిన సుమారు 2 ఎకరాల కాఫీ తోట మంటల్లో కాలిపోయింది.
అల్లూరి జిల్లా, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లాలోని బస్కి పంచాయతీ కంజరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గిరిజన రైతుకు సంబంధించిన కాఫీ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో జి. అప్పలనాయుడుకి చెందిన సుమారు 2 ఎకరాల కాఫీ తోట మంటల్లో కాలిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో కాఫీతో పాటు మిరియాల పంట కూడా పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు సకాలంలో స్పందించి మిగిలిన తోటలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
అయితే, స్థానిక అధికారులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్లి మిగిలిన తోటలను రక్షించడానికి చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో రైతుకు దాదాపు రూ.5 లక్షల పంట నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి పెంచుకున్న తోటలు కళ్లముందే బూడిదవ్వడంతో రైతు అప్పలనాయుడు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఏపీ ప్రభుత్వం స్పందించి బాధిత రైతుకు తక్షణ పరిహారం అందించి ఆదుకోవాలని స్థానికులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పర్యాటక ప్రాంతమైన అరకులోయలో ఇలాంటి ఘటనలు జరగడం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు
జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలి: పవన్ కల్యాణ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News