అనకాపల్లి జిల్లాలో ముగ్గురి యువకుల మృతి.. హోం మంత్రి అనిత విచారం
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:22 AM
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులోని వరాహ నదిలో శనివారం స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతై, మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. యువకుల మృతిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా , నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులోని వరాహ నదిలో నిన్న(శనివారం) స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతై, మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు (ఆదివారం) ఉదయం యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. యువకుల మృతిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) విచారం వ్యక్తం చేశారు. శనివారం ఈతకు వెళ్లి వరాహ నదిలో యువకులు గల్లంతై, చనిపోయారని తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగాయని చెప్పుకొచ్చారు. యువకులు మృతిచెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు హోం మంత్రి అనిత ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బంధువుల నిరసన..
కాగా, యువకుల మృతి పట్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ వారి బంధువులు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. వారి నిరసనతో పెనుగల్లు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీపై జగన్ కక్ష సాధిస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News