Share News

శ్రీకాకుళం జిల్లాలో బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Sep 19 , 2026 | 10:28 AM

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి పలాస వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

శ్రీకాకుళం జిల్లాలో బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Srikakulam Bus Fire Accident

శ్రీకాకుళం జిల్లా, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి పలాస వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నరసన్నపేట జమ్ము జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది.


బస్సు వెనుక సీటులో మొదలైన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తానికి వ్యాపించి, పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ హుటాహుటినా బస్సు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నరసన్నపేట జమ్ము జంక్షన్ వద్ద ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దశాబ్దాల నిరీక్షణకు తెర.. 25 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్‌ ఎంఓయూ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 10:41 AM