లోతట్టు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:34 PM
కాకినాడలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాకినాడ, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలోని సుద్దగడ్డ వాగు ముంపుపై పవన్ ఆరా తీశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తీవ్ర వర్షాల కారణంగా రోడ్లపై కూలిన చెట్లను తక్షణమే తొలగించి రాకపోకలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
దసరా ఉత్సవాలు.. అస్సాం ప్రముఖులకు ఎంపీ చిన్ని ప్రత్యేక ఆహ్వానం
Read Latest AP News And Telugu News