Share News

దసరా ఉత్సవాలు.. అస్సాం ప్రముఖులకు ఎంపీ చిన్ని ప్రత్యేక ఆహ్వానం

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:12 PM

దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రముఖులను విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తూ నగరానికి మరింత జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు.

దసరా ఉత్సవాలు.. అస్సాం ప్రముఖులకు ఎంపీ చిన్ని ప్రత్యేక ఆహ్వానం
MP Kesineni Chinni

విజయవాడ, సెప్టెంబర్ 24: దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రముఖులను విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తూ నగరానికి మరింత జాతీయ గుర్తింపు తీసుకురావడంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ప్రత్యేక దృష్టి సారించారు. అస్సాం ప్రముఖులకు విజయవాడ ఆతిథ్యాన్ని అందించేందుకు చిన్ని ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈరోజు(గురువారం) అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్‌, సీఎస్ డాక్టర్ రవి కోటను మర్యాదపూర్వకంగా కలిశారు.


ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి అస్సాం ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా అస్సాం ప్రముఖులకు ఆహ్వానం పలికారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. దుర్గమ్మ దర్శనంతో పాటు విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటే ‘విజయవాడ ఉత్సవ్‌’లో పాల్గొనాలని కోరారు.


విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్‌ నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు ఎంపీ తెలిపారు. ఇంద్రకీలాద్రి వైభవం, విజయవాడ ప్రత్యేకతను ప్రతిబింబించేలా విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

వాయుగుండం ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 02:08 PM