పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:22 PM
పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నామని, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విజయవాడ, నవంబర్ 16: ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాలో 50 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, ఆయా గ్రామాల్లో పోలీసులతో కవాతు నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు.. 3,280 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల విధుల్లో 9,700 మంది సిబ్బంది పాల్గొంటారు. మొదటి విడతలో నందిగామ, జగ్గయ్యపేటలో ఎన్నికలు నిర్వహించగా.. రెండో విడతలో తిరువూర్ ప్రాంతంలో ఎన్నికలను నిర్వహిస్తాం. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా 50 సమస్యాత్మక గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశాం. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ముందుగానే చర్యలు చేపట్టాం. సర్పంచ్ ఎన్నికలకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్‌ను నిర్ణయించగా.. వార్డు సభ్యుల ఎన్నికలకు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి
వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన
అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News