అభివృద్ధిని కోరేవారు కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:35 AM
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని.. అభివృద్ధి, సంక్షేమం కోరుకునే ప్రతీ ఒక్కరూ కూటమి అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు.
నెల్లూరు, నవంబరు 25: గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలను కోరారు.
‘కూటమి పార్టీలు ఒక తాటిమీద నిలబడడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ప్రతీ దగ్గర అత్యధిక మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నాం. పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. ప్రజల ఆకాంక్షలను కూటమి నెరవేరుస్తుంది. అభివృద్ధి, సంక్షేమం కోరుకునే ప్రతీ ఒక్కరు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌కే ఓటు వేసి గెలిపించాలి.
వైసీపీలో బీసీలకు రిజర్వేషన్ తగ్గించటం వలన చాల మంది రాజకీయాలకు దూరం అయ్యారు. బీసీలకు 34 శాతం కాదు.. 40 శాతం రిజర్వేషన్‌ను చంద్రబాబు కట్టబెట్టారు. బీసీలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేయర్, చైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించి, విపత్తులను ఎదుర్కొన్న సమర్ధుడు చంద్రబాబు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ చంద్రబాబు అనుభవంతో రానించగలుగుతున్నారు.
గ్రామ స్థాయి నుంచి ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలి. వైసీపీ హయాంలో కనీసం ప్రతిపక్షాలు నామినేషన్లు వేసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ప్రజ్వలించింది. 2024 ఎన్నికల్లో ఈవీయం ద్వారా గెలిచారు.. అని ప్రచారం చేస్తోన్న వారికి.. మొన్న స్థానిక సంస్థల బ్యాలెట్ విజయం చెంపపెట్టు’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News