Share News

నెల్లూరులో విషాదం.. విద్యుత్ షాక్‌తో అక్కాచెల్లెళ్లు మృతి

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:44 PM

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హరినాథపురంలో విద్యుదాఘాతంతో అక్కాచెల్లెళ్లు మృతిచెందారు.

నెల్లూరులో విషాదం.. విద్యుత్ షాక్‌తో అక్కాచెల్లెళ్లు మృతి
Nellore Electric Shock News

నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హరినాథపురంలో విద్యుదాఘాతంతో అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. ఆటలాడుతూ నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి చిన్నారులు వెళ్లారు. ఈ క్రమంలో వాటర్ ట్యాంకు ఓవర్ ఫ్లో కావడంతో మిద్దెపైకి నీరు చేరింది.


అక్కడే కరెంట్ తీగలు ఉండటం, వాటిలో విద్యుత్తు సరఫరా అవుతోండటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు ఊర్లగుంట జ్యోతి (11), అమూల్య (7) అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలోని ఆస్పత్రికి వారిని తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని బాలాజీ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్

స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి

కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 05:53 PM