Minister Anam: జగన్ హయాంలో ఆ యాక్ట్‌తో రైతన్నలను నష్టపరిచారు.. మంత్రి ఆనం ఫైర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:09 PM
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటూ.. వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులని ప్రభుత్వం కల్పిస్తూ మీ భూమి - మీ హక్కు కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
నెల్లూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఈ యాక్ట్‌తో రైతులు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు ప్రయోజనాల దృష్ట్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేశారని ప్రస్తావించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ఇవాళ(శనివారం) నెల్లూరు జిల్లాలోని ASపేట మండలం హసనాపురంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉండి.. వారి సమస్యలను సకాలంలో పరిష్కరింస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులను తమ ప్రభుత్వం కల్పిస్తూ ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతన్నకి అన్నం పెట్టే భూమికి.. రైతుని రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు 35లక్షల మంది రైతుల పాసుపుస్తకాలను మార్చేసిందని ఆరోపణలు చేశారు. ఆ పాసుపుస్తకాలు దొంగనోట్లు వంటివని విమర్శలు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
రీ సర్వే పేరుతో హద్దురాళ్లపై జగన్ మోహన్ రెడ్డి తన బొమ్మలు ముద్రించి రూ.650కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ట్రూఅప్ పేరుతో విద్యుత్తు ఛార్జీల మోతమోగించారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీలని పూర్తిగా రద్దు చేసిందని గుర్తుచేశారు. ప్రతి నెలా 9వ తేదీన ఏదో ఒక గ్రామానికి స్వయంగా సీఎం చంద్రబాబు వచ్చి పట్టదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..
గంజాయికి ‘నో’ చెప్పి భవిష్యత్ సురక్షితం చేసుకోండి
Read Latest AP News And Telugu News