Share News

అక్కడ పాలతో కాదు తేళ్లతో అభిషేకం

ABN , Publish Date - Aug 31 , 2026 | 10:00 PM

కొందరు భక్తులు తమ ఇష్టదైవాన్ని నీళ్లతో అభిషేకిస్తారు. మరికొందరు పాలతో అభిషేకిస్తారు. అయితే తేళ్లతో అభిషేకించడాన్ని ఎప్పుడైనా చూశారా..?

అక్కడ పాలతో కాదు తేళ్లతో అభిషేకం
Scorpion Abhishekam

కర్నూలు జిల్లా, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కోడుమూరులోని ఓ ఆలయంలో వింత ఆచారం నడుస్తోంది. ఎక్కడైనా భక్తులు పాలతోనో, నీళ్లతోనో దేవుడిని అభిషేకిస్తారు. కానీ కోడుమూరులోని కొండపై వెలసిన కొండలరాయుడిని మాత్రం భక్తులు తేళ్లతో అభిషేకించారు. ప్రతి ఏటా శ్రావణ మాసం మూడో సోమవారం రోజు ఆలయ పరిసరాల్లో ఉన్న రాళ్ల కింద తేళ్లను పట్టుకుని.. ఇలా అభిషేకిస్తామని భక్తులు సగర్వంగా చెబుతున్నారు. తేళ్లతో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తామని వివరిస్తున్నారు.


తేళ్లతో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు వెంటనే తీరుతాయని అక్కడి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తేళ్ల పూజలు, అభిషేకాలు జరిపిస్తున్నారు. అయితే తేళ్లను నేరుగా చేతులతో పట్టుకుంటున్నా అవి కుట్టవా..? అన్న ప్రశ్నలకూ వారే సమాధానమిస్తున్నారు. సాధారణంగా ఈ తేళ్లు తమని కుట్టవని, ఒకవేళ కుట్టినా కొండలరాయుడి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే నొప్పి కొంచెమంటే కొంచెం కూడా ఉండదని అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..

వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా

తిరుపతి నైలిట్ సంస్థ మూసివేతపై క్లారిటీ.. అసలు విషయమిదే

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 10:02 PM