మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - May 01 , 2026 | 11:07 PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయం, మే 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు.