Share News

అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ ఛాలెంజ్

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:04 PM

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో జగన్ ఓ శకుని అని... తెరవెనుక శిఖండిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ​

 అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ ఛాలెంజ్
Minister Satya Kumar Yadav

అమరావతి, అక్టోబర్ 31: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో జగన్ ఓ శకుని అని... తెరవెనుక శిఖండిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ​మున్సిపల్ ఎన్నికల్లో తనపై అక్రమాలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు. ​మరో 24 గంటల్లో వైసీపీ భూస్థాపితం ఖాయమని.. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. ​ఓటమి భయంతోనే వాస్తవాలను వక్రీకరించి సొంత మీడియాతో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.


​మేనమామగా కనీస బాధ్యత నెరవేర్చలేని జగన్.. ఇతరులకు నీతులు చెబుతారా అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ​సొంత తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తికి విమర్శించే నైతిక హక్కు ఎక్కడుందని అన్నారు. ​వైశ్యులను రాజకీయ పావులుగా వాడుకోవడం వైసీపీ రాజకీయ రాక్షస క్రీడకు నిదర్శనమంటూ ఫైర్ అయ్యారు. ​చేనేత కార్మికులపై దాడులు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ​పచ్చి ఆర్థిక నేరగాడు జగన్ అని.. ప్రత్యర్థులు డబ్బులు ఖర్చుపెడుతున్నారని ఆరోపించడం విడ్డూరమన్నారు. వైసీపీ హయాంలో దళిత డాక్టర్ సుధాకర్ ఘటన, డోర్ డెలివరీ హత్యలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ​అనవసర వివాదాలు మానుకుని.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీకి చేరుకున్న కేంద్ర బృందం.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనా

విజయవాడలో ఎన్నికల సామాగ్రి పంపిణీ.. పోలింగ్‌కు సర్వం సిద్ధం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 01:06 PM