హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:24 PM
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో అక్రమ అండాల సేకరణ వ్యవహారం గుట్టురట్టైంది. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి డబ్బు ఆశ చూపించి వివిధ రాష్ట్రాల యువతులను హైదరాబాద్‌కు రప్పించి అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, అక్టోబర్ 31: నగరంలోని సరూర్‌నగర్‌లో అక్రమ అండాల సేకరణ వ్యవహారం గుట్టురట్టైంది. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి డబ్బు ఆశ చూపించి వివిధ రాష్ట్రాల యువతులను హైదరాబాద్‌కు రప్పించి అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఓ అద్దె హాస్టల్ ఏర్పాటు చేసిన దుర్గాప్రసాద్.. పేదరికంలో ఉన్న యువతులను ప్రలోభపెట్టి నెలనెలా అండాలు సేకరిస్తున్నట్లు విచారణలో బయటపడింది. యువతుల నుంచి సేకరించిన అండాలను వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుర్గాప్రసాద్‌తో పాటు 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. అండాలను సరఫరా చేస్తున్న ఆసుపత్రులకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? అండాల సేకరణ, సరఫరా నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్
ఏపీకి చేరుకున్న కేంద్ర బృందం.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనా
Read Latest Telangana News And Telugu News