Share News

కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:51 AM

కదిరి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఐదుగురిని ఎంసీసీ, ఎస్ఎస్‌టీ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.

కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్
Kadiri mincipal elections

అమరావతి, అక్టోబర్ 31: కదిరి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఐదుగురిని ఎంసీసీ, ఎస్ఎస్‌టీ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. మొత్తం మూడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా.. రూ.73,000 నగదుతో పాటు 11 ఓటర్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. మూడు కేసులను నమోదు చేశారు.


44వ వార్డు కుటగుళ్లలో గలేటి మురళీకృష్ణ, పి. వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు వైసీపీ అభ్యర్థి వెంకటగిరి అవేంద్రకు అనుకూలంగా డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వారి వద్ద నుంచి రూ.30,000 నగదు, 3 ఓటర్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 14వ వార్డు - మసనంపేటలో ఎన్. షకీర్, పి. సద్దాంను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థి నల్లమాడ షేక్ ఆవేజ్ ఖర్నీకి అనుకూలంగా డబ్బుల పంపిణీ చేస్తున్నారని ఆరోపణల వచ్చాయి. వారి వద్ద నుంచి రూ.34,000 నగదు, 5 ఓటర్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు.


12వ వార్డు - గాంధీనగర్‌లో కూడా పి.మహమ్మద్ అలీని ఎంసీసీ, ఎస్ఎస్‌టీ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. తన భార్య, వైసీపీ అభ్యర్థి పి.రుబీనాకు అనుకూలంగా డబ్బుల పంపిణీ ఆరోపణలు రావడంతో అతడిని అరెస్ట్ చేశారు. మహమ్మద్ అలీ వద్ద నుంచి రూ.9,000 నగదు, 3 ఓటర్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్లు 264/2026, 265/2026, 266/2026 కింద మూడు కేసులు నమోదు అయ్యాయి. బీఎన్ఎస్ సంబంధిత సెక్షన్ల కింద నమోదైన ఈ మూడు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..

మరికొద్ది రోజుల్లో గగన్‌యాన్ D1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 10:38 AM