Share News

అనాథ బిడ్డనమ్మా..

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:13 AM

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ‘అమ్మలారా.. అక్కలారా...’ అంటూ చేసిన వినూత్న ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షించింది. 35వ డివిజన్‌ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా శివాచారి పోటీకి దిగారు.

అనాథ బిడ్డనమ్మా..

  • ఓటేసి పుణ్యం కట్టుకోండమ్మా!

  • నెల్లూరులో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ‘అమ్మలారా.. అక్కలారా...’ అంటూ చేసిన వినూత్న ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షించింది. 35వ డివిజన్‌ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా శివాచారి పోటీకి దిగారు. ఒక ఆటోను అద్దెకు తీసుకొని.. దానికి తన బ్యానర్‌ కట్టుకున్నారు. తన వాయిస్‌తో ఒక ఆడియో రికార్డు చేసి, ఆ ఆటోను డివిజన్‌లోని ప్రజల మీదకు వదిలారు. తెల్లవారుజాము 5 గంటలయితే చాలు ఆ ఆటో వీధిలోకి వచ్చి నిలబడుతుంది.

అభ్యర్థి వాయి్‌సతో రికార్డు చేసిన క్యాసెట్‌ ఆన్‌ అవుతుంది. ‘అమ్మలారా.. అక్కలారా.. అమ్మా నాన్న లేని అనాథ బిడ్డను. అందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఓటేసి పుణ్యం కట్టుకోండి. అమ్మా... అయ్యా... రాజకీయ పార్టీలు నన్ను మోసం చేశాయి. మీరు కూడా మోసం చేయవద్దు. మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా’ అంటూ ఆ స్వతంత్ర అభ్యర్థి ప్రజలను ఓట్లు అడగడం ఆసక్తిగా మారింది. ఇలా ఆ ఆటో గత రోజులుగా వీధివీధికి పదేపదే తిరుగుతూ తమ చెవుల తుప్పును వదిలించిందని పలువురు చెప్పారు.

- నెల్లూరు-ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 31 , 2026 | 05:13 AM