గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందు అపహరణ
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:22 AM
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ తల్లి వద్ద నుంచి కొందరు దుండగులు పసికందును ఎత్తుకెళ్లారు. గమనించిన ఆ తల్లి.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
గుంటూరు, అక్టోబర్ 31: తల్లి వద్ద నుంచి పసికందును అపహరించిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ తల్లి వద్ద నుంచి కొందరు యువకులు.. పసికందును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఓ పసికందును ఎత్తుకెళ్లారు. ఏటుకూరు రోడ్డులో గల పాత సామానులు సేకరించే షాప్ ముందు ఓ తల్లి.. తన పసికందుతో నిద్రిస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి.. ఆ తల్లి వద్ద నుంచి పసికందును అపహరించారు. గమనించిన తల్లి.. లబోదిబోమంటూ స్థానిక లాలాపేట పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్పోర్టే!
మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు
For More AP News And Telugu News