విజయవాడలో ఎన్నికల సామాగ్రి పంపిణీ.. పోలింగ్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:49 PM
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నగరంలోని లయోలా కళాశాల ప్రాంగణంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ మొదలైంది.
విజయవాడ, అక్టోబర్ 31: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నగరంలోని లయోలా కళాశాల ప్రాంగణంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ మొదలైంది. 85 డివిజన్ల కార్పొరేటర్లు, మేయర్ ఎన్నికకు సంబంధించి పోలింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో ఒక డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవం అయ్యిందన్నారు.
85 డివిజన్లకు రేపు (ఆదివారం) ఎన్నికలు జరగబోతున్నాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. నగరంలో మొత్తం 848 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బందితో కలిపి సుమారు 10 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. నగరంలో 150 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్
ఏపీకి చేరుకున్న కేంద్ర బృందం.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనా
Read Latest AP News And Telugu News