ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్త జనం
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:32 PM
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే ఆలయానికి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది.
విజయవాడ, జులై 12 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని (Vijayawada Kanaka Durga Temple) దర్శించుకునేందుకు ఈరోజు(ఆదివారం) భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే ఆలయానికి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో, సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నిరకాల వీఐపీ (VIP) దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.
దీనివల్ల క్యూ లైన్లలోని సామాన్య భక్తులు అమ్మవారిని అత్యంత వేగంగా, సులభంగా దర్శించుకున్నారు. నూతన నీటి సరఫరా విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలోని భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల (సంచార నీటి డబ్బాల) ద్వారా చల్లని తాగునీటిని ఆలయ సిబ్బంది అందజేశారు. అలాగే, ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదానం విరివిగా పంపిణీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు
యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News