Share News

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - May 26 , 2026 | 09:34 AM

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న సితారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూలింగ్ కెనాల్ డివైడర్‌ను ఢీకొంది. అయితే బస్సు ముందుభాగం కూలింగ్ కెనాల్ వంతెనను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
NTR District Bus Accident

ఎన్టీఆర్ జిల్లా, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న సితారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూలింగ్ కెనాల్ డివైడర్‌ను ఢీకొంది. అయితే బస్సు ముందుభాగం కూలింగ్ కెనాల్ వంతెనను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు.


అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సులో ప్రయాణిస్తున్న అందరూ క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కాసేపు ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం క్రేన్ సహాయంతో బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు

గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 09:56 AM