వాసుదేవరెడ్డి రిమాండ్‌పై న్యాయవాదులు ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 21 , 2026 | 07:59 PM
సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జగన్ మోహన్ రెడ్డి హయాంలో వాసుదేవరెడ్డి.. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని రెండో నిందితుడిగా (A2) సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇవాళ(శనివారం) వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని తెలిపారు.
ఈ కేసులో ఆయన అప్రూవర్‌గా మారారని, వాసుదేవరెడ్డిని అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి విచారణకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులకు సమర్పించినట్లు స్పష్టం చేశారు. ఏపీ హైకోర్టులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్స్ పెండింగ్‌లో ఉన్నాయని ప్రస్తావించారు. ఈ కేసులో ఆర్కిటెక్ట్ ఉన్న ముప్పిడి అవినాశ్‌ను సిట్ అరెస్టు చేయలేదని అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారంలో సిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఈ కేసు విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని.. జైల్లో పెట్టాలి కాబట్టి హడవుడిగా అరెస్టు చేశారని ప్రస్తావించారు. ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని తెలిపారు. సెక్షన్ 35 నోటీసులు జారీ చేసి రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరుతున్నానని చెప్పారు. ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా డిప్యుటేషన్‌పై వచ్చారని.. మళ్లీ మాతృ సంస్థకు వెళ్లారని ప్రస్తావించారు. కేంద్ర సంస్థలో సీనియర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారని తెలిపారు.
వాసుదేవ రెడ్డి పాత్ర కీలకం: న్యాయవాది రాజేంద్ర ప్రసాద్
మద్యం కుంభకోణం కేసులో వాసుదేవ రెడ్డి పాత్ర కీలకమని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అతనికి తెలిసే ఈ అక్రమాలు జరిగాయని అన్నారు. అప్రూవర్‌గా మారినంత మాత్రాన నిర్దోషిగా చూడలేమని చెప్పుకొచ్చారు. అతడిని కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం సేకరించాల్సి ఉందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News