Kesineni Shivanath: ఏసీఏ కీలక నిర్ణయం.. ఉమెన్ టీమ్ మెంటార్‌గా మిథాలి రాజ్..!
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:16 PM
విశాఖపట్నం స్డేడియాన్ని పునరుద్ధరణ చేశామని ఏసీఏ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏ గ్రౌండ్‌లానే బీ గ్రౌండ్‌లో కూడా రెస్ట్ రూమ్స్ పెట్టబోతున్నామని వెల్లడించారు. విశాఖ స్టేడియంలో ఛైర్స్ మారుస్తున్నామని వివరించారు.
విజయవాడ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాలంలో ఏసీఏను ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Shivanath) వ్యాఖ్యానించారు. ఇవాళ (మంగళవారం) విజయవాడలో ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.... విశాఖపట్నం స్డేడియాన్ని పునరుద్ధరణ చేశామని తెలిపారు. ఏ గ్రౌండ్‌లానే బీ గ్రౌండ్‌లో కూడా రెస్ట్ రూమ్స్ పెట్టబోతున్నామని వెల్లడించారు. విశాఖ స్టేడియంలో ఛైర్స్ మారుస్తున్నామని వివరించారు. మిథాలి రాజ్‌ను ఉమెన్ టీమ్ మెంటార్‌గా నియమించబోతున్నామని వెల్లడించారు కేశినేని శివనాథ్.
ఏసీఏ చరిత్రలో ఈ ఏడాది జరిగినన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పుకొచ్చారు. ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు కూడా జరిగాయని తెలిపారు. మహిళా క్రికెటర్ల పేర్లు రెండు గేట్స్‌కి పెట్టామని వెల్లడించారు. త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ సెంటర్‌గా మంగళగిరి స్టేడియాన్ని మార్చబోతున్నామని తెలిపారు. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లాగా మూలపాడును డెవలప్‌మెంట్ చేయబోతున్నామని వివరించారు. కడప స్టేడియం మౌలిక వసతులు సరిగా లేవని చెప్పుకొచ్చారు. అక్కడ రూమ్స్ నిర్మించబోతున్నామని తెలిపారు. రూరల్ టాలెంట్ సెర్చ్ పేరుతో రూరల్ క్రికెటర్స్‌ను వెలికితీసి కోచింగ్ క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విదేశీ కోచ్‌ను ఆంధ్ర టీమ్‌కి నియమించబోతున్నామని వివరించారు. వరల్డ్ కప్ సమయంలో మహిళా క్రికెటర్స్‌ను మంత్రి నారా లోకేశ్ ఎంకరేజ్ చేశారని తెలిపారు. ఆ టీమే వరల్డ్ కప్ గెలవడం అనందంగా ఉందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
పారద్శకత్వంతో ముందుకు వెళ్తున్నాం:సానా సతీశ్
న్యూజిలాండ్ ప్లేయర్ గ్యాసీ స్టీడ్‌ను ఏసీఏ కోచ్‌గా నియమించబోతున్నామని ఏసీఏ సెక్రటరీ సానా సతీశ్ పేర్కొన్నారు. మిథాలిరాజ్‌ను ఉమెన్ టీమ్ మెంటార్‌గా నియమించబోతున్నామని వెల్లడించారు. పారద్శకత్వంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు ఎన్నున్నా పారద్శకతతోనే వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అండర్ 14 టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. కొత్త క్రీడాకారులను ప్రోత్సహించడంపైనే దృష్టి సారించామని వివరించారు.క్రికెట్ అసోసియేషన్స్‌కు రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచుతున్నామని వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన నూతన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని సానా సతీశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పర్యావరణ పరిరక్షణపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News