Share News

దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం కానుక

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:59 AM

విజయవాడ కనకదుర్గమ్మకు స్వర్ణ కిరీటం కానుకగా అందింది. దాదాపు రూ.75 లక్షలు విలువైన స్వర్ణ కిరీటాన్ని దాతలు బహూకరించారు.

దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం కానుక
Gold Crown Donation

విజయవాడ, అక్టోబర్ 15: విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు తరచూ వివిధ రకాల విలువైన బంగారు కానుకలను సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. తాజాగా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం కానుకగా అందింది. దాదాపు రూ.75 లక్షలు విలువైన స్వర్ణ కిరీటాన్ని దాతలు బహూకరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాతలు 494 గ్రాముల బంగారు కిరీటాన్ని దుర్గమ్మకు కానుకగా సమర్పించారు. కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె.దుర్గా శ్రీనివాస్‌ స్వర్ణ కానుక అందించారు.


ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో నవరత్న ఖచిత కిరీటాన్ని రూపకల్పన చేశారు. ఈరోజు(గురువారం) స్వర్ణ కిరీటాన్ని ఆలయ ఈవో వీకే శీనా నాయక్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి.త్రినాథరావుకు దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబానికి అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేయడంతో పాటు.. శేషవస్త్రం, ప్రసాదాలతో దాతలను అధికారులు సత్కరించారు. అమ్మవారి దయతోనే స్వర్ణ కిరీటాన్ని సమర్పించుకోగలిగామని దాత దుర్గా శ్రీనివాస్ తెలిపారు.


ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకారాల్లో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఉత్సవాల్లో ఐదోరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

17 వసంతాలు పూర్తి చేసుకున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’.. మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

ఏబీఎన్ 17వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు విషెస్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 01:00 PM