17 వసంతాలు పూర్తి చేసుకున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’.. మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:01 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక 24వ వార్షికోత్సవం, 17 వసంతాలు పూర్తి చేసుకున్న ఏబీఎన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనవాణిని తన బాణీగా చేసుకుని, నిజాన్ని నిర్భయంగా చూపే దమ్మున్న ఛానల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అని కొనియాడారు.
అమరావతి, అక్టోబర్ 15: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 17 వసంతాలు పూర్తి చేసుకున్న ఏబీఎన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. అక్షరమే ఆయుధంగా జనవాణిని తన బాణీగా చేసుకున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక 24వ వార్షికోత్సవం, నిజాన్ని నిర్భయంగా చూపే దమ్మున్న ఛానల్ ఏబీఎన్ 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్, ఎండీ వేమూరి రాధాకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు, జర్నలిస్టులు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రయోజనాలు, విలువలతో కూడిన కథనాలు, ప్రసారాలతో తెలుగు పాఠకులు, వీక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్.. అను నిత్యం వార్షికోత్సవ స్ఫూర్తిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు
అబ్దుల్ కలాం జయంతి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు
Read Latest AP News And Telugu News