ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:51 AM
17 వసంతాలు పూర్తిచేసుకుని 18వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, అక్టోబర్ 15: 17 వసంతాలు పూర్తిచేసుకుని 18వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వరానికి వేదికగా నిర్భయ జర్నలిజానికి ప్రతీకగా ఏబీఎన్ నిలిచిందన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే ధైర్యం, వాస్తవాలను వెలికితీసే పట్టుదల ఏబీఎన్ ప్రత్యేకత అని కొనియాడారు. పాత్రికేయ విలువల పట్ల వేమూరి రాధాకృష్ణ నిబద్ధత అభినందనీయమన్నారు. సవాళ్లను అధిగమిస్తూ సంస్థను ముందుకు నడిపిస్తున్న రాధాకృష్ణ నాయకత్వం స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు.
ప్రశ్నలో స్పష్టత, విశ్లేషణలో లోతు, ప్రజాప్రయోజనమే రాధాకృష్ణ పాత్రికేయ దృక్పథమని మంత్రి అన్నారు. పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రాధాన్యమిస్తున్న రాధాకృష్ణ ప్రస్థానం ప్రశంసనీయమన్నారు. సామాన్యుడి సమస్యలకు, బాధితుల ఆవేదనకు ఏబీఎన్ బలమైన వేదిక అని తెలిపారు. ఏబీఎన్ విజయప్రస్థానంలో పాత్రికేయులు, సాంకేతిక సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. రాధాకృష్ణ సారథ్యంలో ఏబీఎన్ మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి...
రావణ్కు 28 వరకు రిమాండ్ పొడిగింపు
ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ
Read Latest AP News And Telugu News