Share News

‘డబుల్‌ డ్యూటీ’కి సెలవులు ఇవ్వొద్దు: ఆర్టీసీ

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:48 AM

దసరా పండగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీలో డబుల్‌ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు నగదుకు బదులు డీఓఎఫ్‌, సీఓఎఫ్‌ సెలవులు మంజూరు చేయవద్దని ఆ సంస్థ ఆపరేషన్స్‌ విభాగం ఆదేశించింది.

‘డబుల్‌ డ్యూటీ’కి సెలవులు ఇవ్వొద్దు: ఆర్టీసీ
TSRTC Double Duty Rules

దసరా పండగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీలో డబుల్‌ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు నగదుకు బదులు డీఓఎఫ్‌, సీఓఎఫ్‌ సెలవులు మంజూరు చేయవద్దని ఆ సంస్థ ఆపరేషన్స్‌ విభాగం ఆదేశించింది. వారికి నిబంధనల ప్రకారం డబుల్‌ డ్యూటీ అడ్వాన్స్‌ (డీడీ అడ్వాన్స్‌) మాత్రమే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) అక్టోబరు 13న రీజినల్‌ మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు. దీనిపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కార్మికులు, కార్మిక సంఘాలను సంప్రదించకుండా ఉన్నతాధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని వారు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

2 లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

గ్లోబల్‌ రైజింగ్‌ సమ్మిట్‌కు తరలిరండి

డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 06:48 AM