Share News

డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:28 AM

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై రంగారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మహేశ్వరం జోన్‌ ఎస్‌వోటీ, కడ్తాల పోలీసులు బుధవారం సంయుక్తంగా నిర్వహించిన దాడిలో డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు.

డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు
Kadthal Drug Bust

  • ఇద్దరు నిందితుల అరెస్ట్‌

  • రూ.20 లక్షల విలువైన క్రిస్టల్‌ మెథాంపెటమైన్‌ స్వాధీనం

కడ్తాల్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై రంగారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మహేశ్వరం జోన్‌ ఎస్‌వోటీ, కడ్తాల పోలీసులు బుధవారం సంయుక్తంగా నిర్వహించిన దాడిలో డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. ముంబై నుంచి కడ్తాలకు కారులో తరలిస్తున్న రూ.20 లక్షల విలువ చేసే 170 గ్రాముల క్రిస్టల్‌ మెథాంపెటమైన్‌ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకొని కేరళకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి మారుతి స్విఫ్ట్‌ కారు, రెండు ఐ ఫోన్లు, డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. కడ్తాల పోలీ‌స్‌స్టేషన్‌లో బుధవారం ఆ కేసు వివరాలను మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి వెల్లడించారు. కడ్తాల ఎస్‌ఐ ఎం. రవీందర్‌ తమ సిబ్బందితో కలిసి స్థానిక టోల్‌గేటు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తూ నెంబర్‌ ప్లేట్లు లేకుండా వెళ్తున్న నల్లరంగు మారుతి స్విఫ్టు కారును అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేశారు.


అందులో 50, 60 గ్రాముల చొప్పున ఉన్న మూడు ప్యాకెట్లను విప్పి చూసి క్రిస్టల్‌ మెథాంపెటమైన్‌ డ్రగ్స్‌గా గుర్తించారు. కారులో ఉన్న కేరళ రాష్ట్రం కాసరగోడు జిల్లాకు చెందిన బవుదల్‌ ఉమ్మర్‌ అబ్దుల్‌ ఆజీజ్‌, హంసత్‌ షనాస్‌లను అదుపులోకి తీసుకొని విచారించినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ముంబైకి చెందిన డ్రగ్స్‌ సరఫరాదారుడు సిద్దిక్‌ సూచన మేరకు ముంబైలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్‌ తీసుకొని కడ్తాల టోల్‌ప్లాజా వద్ద రింకు ఠాగూర్‌కు అప్పగించేందుకు మారుతి కారులో వస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. వారి నుంచి రూ.20లక్షల విలువ చేసే 170 గ్రాముల క్రిస్టల్‌ మెథాంపెటమైన్‌ డ్రగ్స్‌, కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనంచేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. సూత్రధారులు సిద్దిక్‌, రింకు ఠాగూర్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు. బవుదల్‌ ఉమ్మర్‌ అబ్దుల్‌ ఆజీజ్‌, హంసత్‌ షనాస్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

న్యూయార్క్‌ కంటే హైదరాబాద్‌ తక్కువేం కాదు

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత

ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 05:32 AM